Feb 01,2023 20:44

ప్రజాశక్తి - పాలకొల్లు
ప్రభుత్వం అన్ని పట్టణాల్లో అన్నా క్యాంటీన్లు తెరవాలని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు కోరారు. పట్టణంలో అన్నా క్యాంటీన్‌ వద్ద కడలి దుర్గేష్‌ విశ్వనాథ్‌ పుట్టినరోజు సందర్భంగా తండ్రి టిడిపి బిసి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కడలి గోపి పేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని 772వ రోజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసీరావు, మేడిశెట్టి కేశవ, ఫకీర్‌ బాబు పాల్గొన్నారు.