
ప్రజాశక్తి-మండపేట
రాష్ట్రంలో అవగాహనా రాహిత్యంతో పరిపాలన కొనసాగుతోందని, రాష్ట్రం అన్నీ రంగాలలోని అన్నిరకాలుగా వెనుకబడిపోయిందని ఎంఎల్ఎ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో డిసెంబర్ 2వ తేదీ నుంచి 50 రోజుల పాటు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మొదటిగా నదురబాద గ్రామంలో ప్రారంభిస్తున్నా మన్నారు. కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి, ప్రజాభిప్రాయాలను సేకరించి ప్రజా సమస్యలను చంద్రబాబుకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, గడి రాంబాబు, తెల్లాకుల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.