Mar 24,2023 23:15

ప్రజాశక్తి - అంబాజీపేట
ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సిగా పంచుమర్తి అనురాధ సాధించిన విజయం ప్రజా విజయమని ఎన్‌టిఆర్‌ యువసేన అధ్యక్షులు, టిడిపి సీనియర్‌ నాయకులు వక్కలంక బుల్లియ్య అన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఘన విజయం పట్ల పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి ప్రధాన సెంటర్లలో మండల శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుభద్రులు ఎన్నికల్లో మూడు స్థానాలు, ఎంఎల్‌ఎ కోటాలో పోటీ చేసిన ఒకే ఒక స్థానంలో టిడిపి ఘన విజయం సాధించిందన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని విజయపదంలో నిలబెట్టడమే అందరి కర్తవ్యమన్నారు.