
ప్రజాశక్తి - అంబాజీపేట
ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సిగా పంచుమర్తి అనురాధ విజయం పట్ల టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అంబాజీపేట, పి.గన్నవరం సెంటర్లలో టిడిపి శ్రేణులు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాయి. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాగబాబు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. పి.గన్నవరం సర్పంచ్ బొండాడ నాగమణి మాట్లాడుతూ ఇది అన్ని వర్గాల ప్రజల విజయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వక్కలంక బుల్లియ్య, రాష్ట్ర నాయకులు మోకా ఆనంద్‌సాగర్, అధ్యక్ష కార్యదర్శులు డి.శ్రీనురాజు, గూడాల ఫణి, డివివి.సత్యనారాయణ, జివి.రాఘవులు, బొంతు పెదబాబు, మట్టపర్తి భారతి, గంగుమళ్ళ వీరభద్రరావు, కుంపట్ల నాయుడు, రావణం రాము, మందపాటి కిరణ్‌కుమార్, నాగాబత్తుల వెంకట సుబ్బారావు, చిన్నం విజయారావు, నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.