Apr 20,2021 21:37

నిత్యావసర వస్తువులను అందజేస్తున్న బ్యాంకు ఉద్యోగులు

శ్రీకాకుళం అర్బన్‌ : అనాథ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు వీలుగా నిత్యావసర సరుకుల ను అందజేశామని శ్రీకాకుళం జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అర్‌అండ్‌బి బంగ్లా సమీపాన ఉన్న శాంతా కళ్యాణ్‌ అనురాగ ఆశ్రమానికి వితరణ అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం ప్రతినిధులు కె.మోహనరావు, జి.కరుణ, ప్రశాంతి, ఎన్‌.ఎం.కె.రాజు, జయరాం, వాసుదేవరావు, ప్రసన్న పాల్గొన్నారు.