Feb 06,2023 16:10
  • అల్లూరి కలెక్టరేట్ వద్ద ధర్నా..
  • 2 గంటలసేపు బైఠాయింపు..
  • 11 మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు....

ప్రజాశక్తి-అల్లూరి : అంగన్వాడీలకు ఫేస్ యాప్ రద్దు పరచాలని, కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని,జీతంలో సగం పెన్షన్ చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని. తమపై వేధింపులను అరికట్టాలని అంగన్వాడి వర్కర్లు నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగమ్మ భాగ్యలక్ష్మి మరియు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోనంగి చిన్నయ్య పడాల్ ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ జె శివ శ్రీనివాస్ కు అంగన్వాడి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందించి అంగన్వాడి వినతి పత్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను ఆయన చదివి వినిపించి అంగన్వాడి సమస్యలపై ఆందోళనను ప్రభుత్వానికి వివరిస్తామని  అలాగే జిల్లా స్థాయిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ తో అంగన్వాడి ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడి సమస్యలపై కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న పోరాటాలపై ముఖ్య నాయకులు సభలో ప్రసంగించారు.