
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో తనదైన పాత్రతో మెప్పించిన అంజలి.. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తర్వాత తమిళ సినిమాల్లో బిజీగా మారినప్పటికీ.. అడపాదడపా తెలుగు సినిమాల్లో మెప్పిస్తోంది. ప్రముఖ దర్శకుడు శంకర్.. రామ్‌చరణ్‌తో తెరకెక్కిస్తోన్న సినిమాలో అంజలి.. హీరోయిన్గా నటిస్తోంది. ఆ సినిమాలో నటిస్తూనే ప్రత్యేక సాంగ్‌లకు సై అంటోంది సీత. నితిన్ నటిస్తోన్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో ఆడిపాడేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో కృతి శెట్టి.. కాథరిన్ ధెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా శ్రేయాస్ మీడియా బ్యానర్‌పై నిర్మితమౌతుండగా.. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 12 నుండి ఈ చిత్రం ధియేటర్లలో సందడి చేయనుంది. అంజలి గతంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించిన సంగతి విదితమే