Nov 28,2022 22:36
  • తొలి 8 నెలల ఖర్చు ఆధారంగా కేటాయింపులు
  • కొత్త పథకాలపై ముందుగానే చెప్పాలి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వచ్చే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ కసరత్తును రాష్ట్ర ఆర్థికశాఖ ప్రారంభించింది. బుధవారం ఈమేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనుంది. దీనికోసం మార్గదర్శకాలు కూడా జారీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఖర్చుల ఆధారంగానే కొత్త బడ్జెట్‌ నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసింది. కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టనున్న కొత్త పథకాలపైనా, వాటికి కావాల్సిన నిధులపైనా ముందుగానే స్పష్టత ఇవ్వాలని నిర్దేశించినది. రావాల్సిన పన్నులు, పన్నేతర ఆదాయంపైనా కీలక సూచనలు చేసిరది. ప్రస్తుత పనుుల రేట్లు, తద్వారా సమకూరుతున్న ఆదాయం ఆధారంగానే ఆదాయం ప్రతిపాదనలు పంపించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనేుళ్లుగా పన్నేతర ఆదాయం తగ్గిపోతోందని, దానిపైనా దృష్టి సారించాలని పేర్కొంది. దీనిపై కొన్నేళ్లుగా దృష్టి సారించకపోవడమేనని గుర్తించినట్లు పేర్కొంది.

  • సేవా పన్నులపై...

సేవా పన్నులను కొనేుళ్లుగా క్రమబద్ధీకరించకపోవడం వల్లనే ఈ సమస్య అని మార్గదర్శకాల్లో పేర్కొనడం గమనార్హర. దీరతో కొత్త బడ్జెట్‌ వినియోగ రుసుము భారం తప్పదను భావం వ్యక్తమవుతోంది. దీనిపై అన్ని శాఖల అధికారులు దృష్టి సారిరచి ప్రతిపాదనలు తయారు చేయాలని స్పష్టర చేసింది.

  • పాత బకాయిలపై కాఠిన్యం

గత కొన్నేళ్లుగా ఖజానాకు రావాల్సిన పాత బకాయిలను కఠినంగా వసూలు చేసే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. దీనిపై శాఖాధిపతులు అవసరమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని స్పష్టం చేశారు.