Oct 28,2021 21:21
  • ఇక ఆన్‌లైన్‌లో టిక్కెట్లు
  • ఇడబ్ల్యుఎస్‌ శాఖ ఏర్పాటు
  • ఆదానికి విశాఖలో 130 ఎకరాల భూమి
  • శారదాపీఠానికి 15 ఎకరాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో బిసిలను కులాల వారీగా లెక్కలు తీయాలను డిమాండ్‌ చర్చకువచ్చింది. ఈ తరహా వివరాల సేకరణ గతంలో ఎప్పుడో జరిగిందని, తాజా జనాభా లెక్కల్లో ఆ వివరాలను మళ్లీ సేకరిస్తే ఆ వర్గాల అభివృధ్ధికి అవసరమైన పథకాల రూపకల్పనకు వీలవుతుందని మంత్రిమండలి అభిప్రాయపడింది. వివిధ సంస్థలు, బిసి సంఘాలు కూడా ఇదే విషయాన్ని కోరుతున్న నేపథ్యంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాల అభివృద్ధికి దోహదపడే కులగణన 2021 జనాభా లెక్కలతో కలిపి చేయాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించిన కేబినెట్‌ సమావేశ వివరాలను మీడియాకు వివరించిన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగానిు పూర్తి స్ధాయిలో అభివృద్ధి చేయాలని, నూతనంగా పది ప్రాజెక్టులను అభివృద్ది చేయాలని, ఇందులో లగ్జరీ రిసార్ట్సు, స్టార్‌ హోటల్స్‌, మెగా స్పిరిచ్యువల్‌ టూరిజమ్‌ ప్రాజెక్టులను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ది ద్వారా రూ.2,800కోట్లు పెెట్టుబడులు రావడంతో పాటు 48వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి చెప్పారు. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ఇడబ్ల్యుఎస్‌ పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఉను బిసి, ఎస్‌సి,ఎస్‌టి సంక్షేమశాఖల తరహాలోనే ఈ శాఖ కూడా పనిచేస్తుందనిచెప్పారు. నూతనంగా జైనులు సిక్కులకుకూడా ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయాలనిమంత్రివర్గం నిర్ణయించింది. సినిమా టిక్కెట్లను ఇక నుండి ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆంధ్రప్రదేశ్‌ సినిమాస్‌ రెగ్యులేషన్‌ చట్టం 1955కుసవరణచేయాలను ప్రతిపాదనను కూడా మంతిమండలి ఆమోదించింది. ఈ మేరక త్వరలోనే ఆర్డినెన్స్‌ జారీ అవుతుందని మంత్రి చెపారు. సీమ్‌లెస్‌ ఆన్‌లైన్‌ మూవీ టిక్కెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసినట్లు ఆయన వివరించారు. ఆన్‌లైన్‌తో పాటు ఫోన్‌కాల్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపారు. దీని వల్ల ప్రేక్షకుల సమయం ఆదా కావడంతో పాటు పనుులను ఎగ్గొట్టడాన్ని నివారించవచ్చని అన్నారు. రెండురోజులుగా వార్తలు వస్తున్న విధంగానే విశాఖ శారద పీఠంకు కొత్త వలసలో 15 ఎకరాల భూమిని కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎంత ధరకుభూమినిఇస్తునాురను ప్రశుకు 'గతంలో చిన్న జీయర్‌ స్వామికి ఎలా ఇచ్చారో అలాగే ఇస్తున్నాం' అని మంత్రి పేర్ని నాని జవాబిచ్చారు. విశాఖలోని మధురవాడలో ఆదాని ఎంటర్‌ ప్రైజేస్‌కు 130 ఎకరాల భూమిని కేటాయించాలను ప్రతిపాదనకూ మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిలో 200 మెగావాట్ల డాటా పార్కు, బిజినెస్‌ పార్కు, స్కిల్‌ సిటీలను 24,990 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ సంస్థ ఏర్పాటు చేస్తుందని, వీటి వల్ల 24,990 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి చెప్పారు.
సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌తో ఒప్పందం
రైతులకు పగటిపూట 9గంటల ఉచిత విద్యుత్తు అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. యూనిట్‌ రూ.2.49 చొప్పున 17వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకోనునుట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. దీనివల్ల రూ.4వేలకోట్ల భారం ప్రభుత్వానికి తగ్గుతుందన్నారు.
కొత్తగా 4వేల ఉద్యోగాలు
వైద్య ఆరోగ్యశాఖలో 4.035 పోస్టులను భర్తీ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. మున్సిపాలిటీల పరిధిలోని అర్భన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో 560 ఫార్మాసిస్ట్‌ పోస్టుల నియామకంతో పాటు వైద్య విద్య, నర్సింగ్‌ తదితర పోస్టులను భరీత చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖలో 41,308 పోస్టులను భర్తీ చేయాలని2019లో లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు26,197 పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు.

మరికొన్ని మంత్రివర్గ నిర్ణయాలు
- మావోయిస్టులపై ఇప్పటివరకు ఉన్న నిషేదాన్ని మరో ఏడాది పొడిగింపు.
- ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటు
- విజయనగరంలో జెఎన్‌టియుకు గురజాడ పేరు
- వాసవీ కన్యకాపరమేశ్వరి సత్రాలు, అనుదానాల నిర్వహణ బాధ్యతలను ఆర్యవైశ్యసంఘాలకు అప్పగింత
- అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి.
- పాలసేకరణ, వస్తువుల తనిఖీ బాధ్యతలు తూనికలు,కొలతల శాఖ నుంచి పశుసంవర్ధక శాఖకు బదిలీ.
- పిపిపి విధానంలో శిల్పారామం అభివృద్ధితో పాటు విశాఖలో తాజ్‌ వరుణ్‌ బీచ్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
 - అనంతపురం జిల్లా బమ్మేపర్తిలో జయలక్ష్మీ నరసింహశాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు17.49 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.