Apr 10,2022 18:21

విజయవాడ : ఏపీ నూతన కేబినేట్ ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్ర గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదంపై అధికారిక గెజిట్  విడుదల అయింది. రాజ్ భవన్ కు నూతన మంత్రుల జాబితా రానుంది. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పరిశీలిస్తారు.