
ప్రజాశక్తి : సెప్టెంబర్ 19, 20, 21 తేదీలో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ 4వ జాతీయ మహాసభలు తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో జరుగుతున్నాయి. ఈ మహాసభలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పరిధిలో ఆదివాసీ హక్కులు, చట్టాలు, రిజర్వేషన్ల పై జరుగుతున్న దాడి, వివిధ ఆధివాసి తెగల సమస్యలపై, ఇంకా అనేక అంశాలు చర్చించనున్నారు. మహాసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనరస, ఇ.సిరిమల్లె రెడ్డి, బి. కిరణ్, పి.బాల్ దేవ్, టి. రామకృష్ణ, డి. రమేష్, 31 మంది ప్రతినిధుల బృందం మహాసభలకు హాజరు అవుతున్నారు.