Oct 13,2021 13:34

విజయవాడ : ఎపి హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ట్‌ ప్రశాంత్‌ కుమార్‌తో గవర్నర్‌ విశ్వభూషణ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పలువురు ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.
    2004, జూన్‌ 26 నుంచి 2007, ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా ప్రశాంత్‌ మిశ్రా పనిచేశారు. 2007, సెప్టెంబర్‌ 1 వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు. 2009, డిసెంబర్‌ 10న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయన.. తాజాగా ఎపి హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.