శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మైలవరం ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశ పరీక్ష

06 ఆగస్టు, 2026

Mylavaram AP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 02:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మైలవరం : మైలవరం ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 7న (శుక్రవారం) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రియజ్యోతి మోడి తెలిపారు. ఇప్పటివరకు 110 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులందరూ ఉదయం 9 గంటలకు మైలవరం ఏపీ గురుకుల బాలికల పాఠశాల పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పెన్, ప్లాంక్ (రైటింగ్ ప్యాడ్), ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో, హాల్‌టికెట్ వెంట తీసుకురావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. పరీక్షకు నిర్ణీత సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్