అమరావతి : రెండు రాష్ట్రాలు కూడా తానే అభివృద్ధి చేశానని, రాష్ట్ర సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యమని సిఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారం చెబుతున్నానన్నారు. ఇదొక చారిత్రక అంశం అని చెప్పారు. ఇప్పటివరకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందనేందుకు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నిదర్శనం అని చెప్పారు. ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో అన్నదానికి భోగాపురం ఉదాహరణ అని అన్నారు. భవిష్యత్తు అనుసంధానానికి అంతర్జాతీయ గేట్‌వేగా తయారు చేశామన్నారు. రెండు రాష్ట్రాలు కూడా తానే అభివృద్ధి చేశానన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశామన్నారు. పాలన బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రస్ఫుటం అవుతాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. ఉమ్మడి ఎపి లో తలసరి ఆదాయం రూ.95,231గా ఉండేదన్నారు. విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104, ఎపి లో తలసరి ఆదాయం రూ.93,903. ఈ పరిస్థితుల నుంచి సీఏజీఆర్ 13.5 శాతం వృద్ధి స్థాయికి చేరామన్నారు. 2019-24 మధ్య జీఎస్‌డీపీ వృద్ధిరేటు 3.18 శాతం తగ్గిందన్నారు. వృద్ధిరేటు తగ్గడంతో రూ.6.94 లక్షల కోట్ల నష్టం జరిగిందని సిఎం చంద్రబాబు వివరించారు.
రెండు రాష్ట్రాలను నేనే అభివృద్ధి చేశా : సిఎం చంద్రబాబు
04 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)