బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన విద్యార్థుల మరణాలను అరికట్టాలి

5 రోజుల క్రితం

హౌస్  arresr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 10:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎమ్మెల్యే జగదీశ్వరి క్యాంపు కార్యాలయ ముట్టడికి పిలుపు

  • ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం నాయకుల గృహనిర్బంధం

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : గిరిజన విద్యార్థుల మరణాలను అరికట్టాలని, ఆరోగ్య కార్యకర్తలను నిర్మించాలని, భద్రగిరి సిహెచ్ సిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కురుపాం_ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి క్యాంపు కార్యాలయం_ముట్టడికి_ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘం_నాయకులను గృహ నిర్బంధం చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం_వరకు గృహ నిర్బంధంలో ఉంచారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్, మండల కార్యదర్శి ఎ.గంగారావు, గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు_ మండంగి రమణ, నాయకులు మండంగి_ శ్రీను, కె.సీతారాంను పోలీసులు అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. భద్రగిరిలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం (సిహెచ్‌సి) ప్రారంభించాలని కోరుతూ గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించనున్న ధర్నాకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కూరంగి సీతారాంను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మండలంలోని డంగభద్రలో ఆయన స్వగృహంలో_ తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం పోలీసుల బలగాలతో అణచివేయాలని చూడడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సరైన వసతులు, వైద్య సదుపాయాల్లేకపోవడం వల్లే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. గిరిజన బిడ్డల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సమాధానం చెప్పాల్సింది పోయి, నాయకులను గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్టులతో గిరిజనుల ఆవేదనను, విద్యార్థి లోకం పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి, మరణించిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని,_ఆశ్రమ పాఠశాలల్లో తక్షణమే ఆరోగ్య కార్యకర్తలు నియమించాలని, మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యాన సాలూరు, బలిజిపేట, సీతానగరం, పాలకొండ, కొమరాడ లో నిరసనలు జరిగాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్