Sep 25,2021 13:03

అంతర్వేది (తూర్పు గోదావరి) : చేపలన్నిటిలో పులసకుండే ప్రత్యేకతే వేరు.. ఎంత రేటయినా ఆ చేపను కొనడానికి కొనుగోలుదారులు పోటీపడుతుంటారు.. అరుదుగా దొరికే ఈ పులస చేప తూర్పుగోదావరిలోని మత్స్యకారుల వలలో చిక్కింది. ఇంకేముంది... ఆ మత్స్యకారుడి పంట పండింది.. ! తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వశిష్ఠ గోదావరిలో సుమారు రెండు కేజీల బరువున్న పులస చేప స్థానిక మత్స్యకారులకు చిక్కింది. ఈ పులసను స్థానిక మార్కెట్‌లో వేలానికి పెట్టగా వ్యాపారులతోపాటు పులస ప్రియులు పోటీపడి మరీ రేటు పలికారు. చివరికి నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.18 వేలకు ఆ పులసను దక్కించుకున్నారు.