
పాలమూరు : అప్పగింతలు కాకముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన గుజ్జుల పద్మకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పద్మ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమార్తె లక్ష్మి (19) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తన చిన్నమ్మ కుమారుడు మల్లికార్జున్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అంతదూరంలో పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని తల్లికి యువతి చెప్పింది. అయినా పెద్దలు వినలేదు. శుక్రవారం ఉదయం 9 గంటలకు లక్ష్మికి వివాహం చేశారు. సాయంత్రం అప్పగింతలకు ముందే వధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మఅతి చెందినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్ మొదటి పట్టణ ఠాణా ఎస్ఐ రామకఅష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.