Sep 27,2021 01:53

పూజలు నిర్వహిస్తున్న మంత్రి ముత్తంశెట్టి

సింహాచలం : సింహాద్రి అప్పన్నను ఆదివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయమూర్తులు డివిఎస్‌ఎస్‌.సోమయాజులు, విజయలక్ష్మి, డి.రమేష్‌, ఆర్‌.రఘునాథ్‌రావు, ఎం.గంగారావు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. దేవస్థానం అధికారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం వారికి సాదర స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.