Nov 25,2022 16:41

ప్రజాశక్తి-మండపేట : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన ఏపి.ఎన్.జి.ఓ అసోసియేషన్ ఉమ్మడి జిల్లాల మండపేట యూనిట్ అధ్యక్షునిగా సి.హెచ్.వి.ఆర్ కృష్ణశాస్త్రి ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులుగా టి.సుభాకర్, సహాయ అధ్యక్షులుగా శిల్ప, సుధాకరరావు, కార్యదర్శిగా వీర్రాజు, సహాయ కార్యదర్శులుగా సాయిబాబా, సురేష్, రాంబాబు, రాముడు, మహిళా సహా కార్యదర్శిగా కల్పన, ట్రెజరర్ గా మోహన్ రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కృష్ణశాస్త్రి మాట్లాడుతూ సంఘం అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఈ ఎన్నికలకు కాకినాడ పట్టణ యూనిట్ సహాయ అధ్యక్షులు అజీజ్, సత్తిరాజు అధికారులుగా వ్యవహరించగా పద్మా మీనాక్షి పర్యవేక్షించారు. నూతన కార్యవర్గాన్ని జి.రామ్మోహన్ రావు, వి.వెంకటకృష్ణ, పి.మూర్తిబాబు, ఎం. వెంకటేశ్వరరావు, జిల్లా జేఏసీ మాజీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, మండల అభివృద్ధి అధికారి ఐదం రాజులు అభినందించారు.