Nov 25,2021 12:19

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి జననీ సాంగ్‌ ను నవంబర్‌ 26న రిలీజ్‌ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పాట సాఫ్ట్‌ మెలోడిగా ఉంటుందని.. మొత్తం సినిమాకి ఈ పాట గుండెవంటిదని ఆయన అన్నారు. ఆ పాటను ఎంజారు చేసి అభిప్రాయాలను తెలపాలని మీడియా, విలేకర్లను కోరారు. మొదటగా మీడియా సమావేశానికి వచ్చిన వారికి మాత్రమే ఆ పాటను ప్రదర్శించారు. శుక్రవారం ఈ పాటను రిలీజ్‌ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో కెమెరాలను కూడా ఆఫ్‌ చేయాలని కోరారు.