Jan 14,2022 19:56

'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి సంక్రాంతి కానుకగా స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదల కావల్సిన ఈ చిత్రాన్ని ఒమైక్రాన్‌ వ్యాప్తి కారణంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరుత్సాహంలో ఉన్న అభిమానుల కోసం రామరాజు, కొమురమ్‌ భీమ్‌ పాత్రల్లో ఉన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటులు ఆలియా భట్‌, అజరు దేవగణ్‌ సహా పలువురు సౌత్‌ అండ్‌ హాలీవుడ్‌ స్టార్లు కనిపించబోతున్నారు.