Mar 02,2021 19:25

అజయ్ భూపతి దర్శకత్వంలో తీసిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాన్ని బాలీవుడ్‌లో 'తడప్‌' పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. అహన్‌ శెట్టి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తోంది. మిలన్‌ లుత్రియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సాజిద్‌ నదియద్‌వాలా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. హీరో అక్షయ్కుమార్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు.