May 17,2022 23:42

లబ్దిదారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణేష్‌

యరకన్నపాలెంలో గడపగడపకూలో ఎమ్మెల్యే గణేష్‌
ప్రజాశక్తి - నర్సీపట్నం టౌన్‌ :
అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదేనని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. మంగళవారం యరకన్నపాలెం గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్‌కు ఎంపీపీ సుర్ల రాజేశ్వరి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళహారతులు పట్టారు. గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయాన్ని, పాఠశాలలో అదనపు గదులు, ప్రహరీ గోడను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యరకన్నపాలెంలో డ్వాక్రా మహిళలకు రూ.కోటి మేర రుణమాఫీ చేసామని, సంక్షేమ పథకాలు రూపేణా మరో రూ.నాలుగు కోట్లను జగన్‌ ప్రభుత్వం అందించిందన్నారు. రూ. 40 లక్షలతో జలజీవన్‌ మిషన్‌లో ఇంటింటికి కుళాయిఏర్పాటు ప్రక్రియ వేగవంతమౌతోందన్నారు. సచివాలయం వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి తలుపు తట్టి పింఛను, ఇతర సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం అందిస్తోందన్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి తారు రోడ్డు వేసి ప్రజల ఆకాంక్ష తీర్చిన ఎమ్మెల్యేకు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపిపిలను సత్కరించారు. మహిళలకు సున్నా వడ్డీ చెక్కులను పలువురు ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ నారాయణమ్మ, మాజీ ఎంపిటిసి బాలు, ఉపసర్పంచ్‌ చంద్రశేఖర్‌, పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, పలువురు వైసిపి నాయకులు, ఎంపిడిఒ ఎన్‌ జయమాధవి, ఐకెపి రమా, సిడిపిఒ రమణి, హౌసింగ్‌, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కారానికి కషి
నక్కపల్లి
: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తన దష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారానికి కషి చేస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. మండలంలోని గొడిచెర్ల గ్రామంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా గ్రామంలో పర్యటించి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు పెన్షన్లు ,ఇల్లు మంజూరు చేయాలని కోరారు .చాకలి గెడ్డను అభివద్ధి చేయాలని గ్రామస్తులు కోరారు. ఇసుక సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లారు.