Jul 04,2022 00:06

ప్రజలతో మాట్లాడుతున్న సిపిఎం నేతలు

జనం కోసం సిపిఎం లో దళిత మహిళల ఆవేదన
ప్రజాశక్తి- కె.కోటపాడు :
మండలంలోని దాలివలస గ్రామంలో జనం కోసం సిపిఎంలో భాగంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గండి నాయినిబాబు ఆధ్వర్యంలో ఇంటింటా సమస్యలపై సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా నాయినిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటన సందర్భంగా పలు సమస్యలను సిపిఎం బృందం దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన చేయూత పథకం వర్తించలేదని ఎస్‌సి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి పనులకు వెళ్తున్నా సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదని, కూలీ డబ్బులు తక్కువగా ఇస్తున్నారని ఉపాధి కూలీలు సర్వే బృందం వద్ద వాపోతున్నారు. నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరగడంతో బతుకు భారంగా మారిందని, గ్రామంలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో దోమల బెడద ఎక్కువయిందని వాపోయారు. దమ్ము సన్యాసిరావు అనేు కల్లుగీత కార్మికుడు తనకు పింఛను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.