Jun 02,2023 23:24

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

ప్రజాశక్తి-పొదిలి : ఆరోగ్యశ్రీ పథకం అర్హులందరికీ వర్తించేలా చర్యలు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డును అందరికీ వర్తింస్తుందన్నారు. దానికి రేషన్‌ కార్డుతో పని లేదన్నారు. 10 ఎకరాల లోపు అనే లిమిట్‌ లేదన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ó 35 ఎకరాల భూమి ఉన్న రైతులకు వర్తిస్తుందన్నారు. ఈ విషయాన్ని వాలంటీర్లు గుర్తించాలన్నారు. మార్కాపురం, తర్లుపాడు మండలాలలో ఇటీవల సుమారు 10 కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్డులేక వైద్యం కోసం ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు. నగర పంచాయతీ కమిషనర్‌, మండల అభివద్ధి అధికారి, వాలంటీర్లు సమన్వయం చేసుకొని ప్రతి కుటుంబానికి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుని తక్షణమే ఆరోగ్యశ్రీ కార్డు జనరేట్‌ అయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్డు రావడంలో ఆలస్యం జరుగుతున్నందున ప్రాథమిక దశలో ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీకి సంబంధించిన యునిక్‌ నెంబర్‌ జనరేట్‌ అవుతుందన్నారు. దాన్ని ప్రింట్‌ తీసి వారికి అందిస్తే ఆరోగ్య సేవల్లో ఇబ్బందులు అధిగమించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రభు త్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లు సంక్షేమ పథకాలను అమలు ప్రజలకు అందజేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. అనంతరం వాలంటీర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీకృష్ణ, ఇఒఆర్‌డి రాజశేఖర్‌, నగర పంచాయతీ కమీషనర్‌ డానియల్‌ జోసఫ్‌, మాజీ ఎంపిపి కోవెలకుంట్ల నరసింహారావు, జిల్లా ఆహార సలహా సంఘం సభ్యుడు కొండ్రగుంట సుబ్బారావు, వైసిపి జిల్లా కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి, వైసిపి నగర పంచాయతీ వైసిపి అధ్యక్షురాలునూర్జాహాన్‌ బేగం, నగర పంచాయతీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పులగొర్ల శ్రీనివాసులు, ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు మల్లాపురం చిన నరసింహాలు, సర్పంచులు ఆవుల వెంకట సుబ్బారెడ్డి, ఉప్పలపాడు సర్పంచి తాళ్లూరి గంగయ్య, మాజీ సర్పంచి ఉలవా గోపి, గ్రామ నాయకులు గుంటూరి పిచ్చిరెడ్డి, పేరం కోదండ రామిరెడ్డి, ఆనికాళ్ల ఈశ్వర రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.