
ప్రజాశక్తి-బొబ్బిలి : పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. సోమవారం బొబ్బిలి పట్టణంలోని ఐదో వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాల అమలుపై ఆరాతీశారు. ప్రతీ గడపలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుల, మత భేదాలు లేకుండా సంక్షేమ పాలన అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, వైసిపి మండల అధ్యక్షులు శంబంగి వేణుగోపాలనాయుడు, వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ, ఇంటి గోపాలరావు, ఎఎంసి వైస్ చైర్మన్ తెంటు పార్వతి, సిరిపురపు లక్ష్మి, జెసిఎస్ పట్టణ కన్వీనర్ రేజేటి ఈశ్వరరావు పాల్గొన్నారు.