May 17,2022 23:33

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట
అర్హత కలిగిన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. మంగళవారం చింతపాక సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. అర్హత ఉండి సాంకేతిక కారణాల వలన సంక్షేమ పథకాలు రాని వారి వివరాలు సేకరించారు. ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఎక్కువగా వైయస్సార్‌ ఆసరా, అమ్మఒడి, పెన్షన్లు, చేయూత, ఇళ్ల స్థలాలు, హౌసింగ్‌ స్కీములు మంజూరుకే ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులదేని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాకవరపు నాగేశ్వరిదేవి, జడ్పిటిసి దొండా రాంబాబు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, మండల వైసీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీడీవో విజయలక్ష్మి, తహశీల్దార్‌ మహేశ్వరరావు, స్థానిక సర్పంచ్‌ గొలజాన శ్రీను, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.