Jul 03,2022 22:21

సమస్యను ఎమ్మెల్యేకు విన్నవిస్తున్న వృద్ధురాలు

ప్రజాశక్తి - పెనుకొండ రూరల్‌ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆడదాకులపల్లిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంక్షేమ పథకాలు అందని వారికి వెంటనే పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల సకాలంలో అందేలా చూడాలన్నారు. ఉపాధి కూలీలకు వెంటనే బిల్లలు చెల్లించాలన్నారు. ఈసందర్భంగా గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించాలని అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం
గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన వైసిపి కార్యకర్త నాగరాజు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం అందజేశారు. మృతుని భార్య పార్వతమ్మకు ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ 50వేల రూపాయల నగదు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలతో పాటు ఆర్థికసాయం అందేలా చూస్తానని కుటుంబానికి హామీ ఇచ్చారు. కార్యక్రమాలలో గ్రామ సర్పంచి అలివేలమ్మ, వైసిపి నాయకులు రామ్మోహన్‌ రెడ్డి. ఉమర్‌ ఫరూక్‌, వెంకట్రామిరెడ్డి, జయశంకర్‌ రెడ్డి, నాగలూరు బాబు, ఎంపీడీవో శివ శంకరప్ప, హౌసింగ్‌ ఎఇ శ్రీనాథ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.