
ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: ఆరోగ్యానికి సంబంధించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహణ కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 11వ తేదీన మణిపాల్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో 10కె, 5కె రన్‌ను నిర్వహించనున్నట్లు హాస్పటల్ డైరెక్టర్ సుధాకర్ కంటిపూడి తెలిపారు. మణిపాల్ హాస్పటల్ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన వివరాలను తెలియచేశారు. రన్‌కు సంబంధించిన పోస్టర్‌ను డిజిపి కె.వి. రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవిష్కరించారని తెలిపారు. ఈరన్ను 11వ తేదీ ఆదివారం ఉదయం విజయవాడ గుణదలలోని బిఆర్టిఎస్ రోడ్డు నందు నిర్వహించనున్నామని తెలిపారు. ఆరోగ్యం పట్ల అవగాహన కోసం గత ఏడాది నిర్వహించిన రన్లో మంచి స్పందన లభించిందని అందుకే ఈఏడాది కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈరన్‌లో అమరావతి రన్నర్Êఉసతో పాటు వాకర్స్ క్లబ్‌లు కూడా పాల్గొంటాయని తెలిపారు. రన్‌కు సంబంధించి రిజస్ట్రేషన్ కోసం 9618558989, 7569304232లకు సంప్రదింవచ్చని తెలిపారు.