Jul 03,2022 23:50

రాస్తారోకో నుద్దేశించి మాట్లాడుతున్న రవ్వ నరసింగరావు

ప్రజాశక్తి -తగరపువలస : ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యాన ఆదివారం స్థానిక వై జంక్షన్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి రవ్వ నరసింగరావు మాట్లాడుతూ, డీజిల్‌ సెస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసి బస్సు చార్జీలు పెంచడం దారుణమన్నారు. మూడు నెలల కాలపరిమితిలోనే రెండోసారి ఆర్‌టిసి ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.500 కోట్ల భారం మోపిందని విమర్శించారు. విద్యార్థుల బస్సు పాస్‌ల రేట్లను కూడా పెంచడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.