Jul 03,2022 22:52

ప్రజాశక్తి - చింతలపూడి
            పెంచిన ఆర్‌టిసి ఛార్జీలను తగ్గించాలని టిడిపి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాటూరి వెంకటరామయ్య, కోండ్రు దేవ, సీనియర్‌ నేత కొత్తపూడి శేషగిరిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఛార్జీల పెంపునకు నిరసనగా బస్టాండ్‌ వద్ద 'బస్‌ ఎక్కుదామనుకున్నా - బాదుడే బాదుడు' నినాదంతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కనమతరెడ్డి రాజారెడ్డి, నాయకులు బాబు, సాంబమూర్తి, సుబ్బారావు, ఐటిడిపి మండల ప్రెసిడెంట్‌ బాణావతు ఉమాశంకర్‌, చింతలపూడి టౌన్‌ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ పల్లె మున్నా పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : ఆర్‌టిసి ఛార్జీలను తగ్గించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపారు. ఆనంతరం కృష్ణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఆర్‌టిసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఛార్జీలు పెంచడంతో పేదలపై భారాలు మోపిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, ఆకుమర్తి రామారావు, రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు రాజాని సత్యనారాయణ, మండల అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు.