
ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్ట్స్ కామర్స్ కళాశాల ఆధ్వర్యాన సంగీత విభాగం సౌజన్యంతో ప్రచురించిన జర్నల్ను ఏయూ వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సంగీత విభాగంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో భాగంగా సమర్పించిన పరిశోధన పత్రాల సంపుటిగా ఈ ప్రత్యేక జర్నల్ను తీసుకువచ్చారు. ప్రత్యేక జర్నల్ ముద్రించడం పట్ల ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి.రాజేంద్ర కర్మార్కర్, డీన్ ఆచార్య డివిఆర్ మూర్తి, సంగీత విభాగాధిపతి ఆచార్య ఎ.అనూరాధ, బిఒఎస్ చైర్మన్ ఆచార్య సరస్వతి విద్యార్థి, సంగీత, నృత్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.