Feb 24,2021 01:15

సమావేశంలో మాట్లాడుతున్న పీడీ

ప్రజాశక్తి-గండేపల్లి : వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద జిల్లాలో 11 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటికి 6 లక్షల మంది లబ్ధిదారులను పూర్తిగా నమోదు చేసినట్టు డిఆర్‌డిఎ పీడీ హరిహర నాథ్‌ తెలిపారు. గండేపల్లి స్త్రీశక్తి భవనంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద మండలంలో 13,545 మంది లబ్ధిదారులను గుర్తించి ఇప్పటికీ 9,219 మంది లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ నమోదు పూర్తయిందన్నారు. జగనన్న తోడు పథకంలో జిల్లాలో 43 వేల మంది లబ్ధిదారులకు 41 వేల మంది లబ్ధిదారులకు అందించినట్టు చెప్పారు. వైయస్సార్‌ చేయూత పథకంలో రెండు లక్షల 30 వేల మందికి లక్ష్యం కాగా పదివేల మందికి వివిధ షాపులు, 14 వేల మందికి పాడిపరిశ్రమలకు, 25 వేల మందికి వివిధ దుకాణాలకు చేయూత ఇచ్చినట్టు చెప్పారు. ప్రతి నెలా జిల్లాలో ఆరు లక్షల మంది పింఛనుదారులకు 1వ తేదీనే 98 శాతం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా వివిధ పథకాలు లక్ష్యాలు పూర్తి కావడంలో ఆలస్యమైందని, త్వరలోనే నూటికి నూరు శాతం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం ప్రశాంతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.