Sep 19,2023 22:57

అరుదైన తాబేలుతో సిబ్బంది

ప్రజాశక్తి - జగ్గయ్యపేట : మండ లంలోని గౌరవరం గ్రామంలో అరుదైన అటవీ తాబేలు దర్శన మిచ్చింది. గౌరవరం గ్రామానికి చెందిన సత్య నారాయణకు ఎన్‌ఎస్‌పి కెనాల్‌ సమీపంలో తాబేలు కనిపించగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గండ్రాయి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ప్రసన్న లీల తాబేలును సేకరించారు. అటవీ ప్రాంతంలో నివసించే తాబేలుగా గుర్తించి సజీవంగా ఉన్న తాబేలు పోచంపల్లి ఫారెస్ట్‌ బ్లాక్‌లో విడిచిపెట్టినట్లుగా ఆమె తెలిపారు.