Feb 22,2021 20:22

సాధారణంగా ఈ రోజుల్లో ఒక సినిమా నిర్మించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. నెలలు లేదా సంవత్సరాల తరబడి చిత్ర నిర్మాణం సాగుతుంటుంది. అయితే లక్ష రూపాయల బడ్జెట్‌తో ఆరు గంటల వ్యవధిలోనే.. ఓ సినిమా నిర్మాణం పూర్తిచేశారు. 'ది మస్కిటో ఫిలాసఫి' పేరుతో తీసిన ఈ చిత్రం గతంలో 'లెన్స్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ తెరకెక్కించారు. నిర్మాత శ్రుతిహాసన్‌. జతిన్‌ శంకర్‌ రాజ్‌ కెమెరామెన్‌. ఈ చిత్రంలో కేవలం సురేష్‌, దర్శకుడు జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌లు మాత్రమే నటించారు. ఎలాంటి సంభాషణలు వుండని ఆ చిత్రం చెన్నైలో జరుగుతున్న 18వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రదర్శితంకానుంది.