Oct 03,2022 00:17

ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు

ప్రజాశక్తి-గుంటూరు:హెక్సజన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో రూ.5.5 లక్షల ప్యాకేజితో తమ కళాశాల విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందారని ఆర్‌ విఆర్‌ అండ్‌ జెసి ఇంజినీరింగ్‌ కాలేజి అధ్యక్షులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం విద్యార్థులు కల్లూరి అభినరు, నంబుల తిరుతేజస్వి, ఉన్నం సాయిశరత్‌, ఉగ్గం రామకృష్ణ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం విద్యార్థి నెల్లూరి గౌరీ ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు కళాశాల సెక్రెటరీ అండ్‌ కరస్పాండెంట్‌ రాయపాటి గోపాలకృష్ణ, ట్రెజరర్‌ డాక్టర్‌ కె.కృష్ణప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.రవీంద్ర, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.వి.శ్రీనివాసరావు,వివిధ విభాగాధిపతులు అభినందించారు.