ఇంటర్నెట్‌డెస్క్ : మహిళల ఆరోగ్యానికి ఏ ఆహారం తింటే మంచిది? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రతి నెలా రుతుక్రమ సమస్యల్ని ఎదుర్కొనే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలికాలంలో మహిళలు రొమ్ముక్యాన్సర్ బారినపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. మరి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందామా?!
ఇటీవల కాలంలో మహిళలు ఆరోగ్యంపై కాస్తంత దృష్టి పెడుతున్నారు. ఉదయాన్నే వ్యాయామాల కోసం సమయం వెచ్చిస్తున్నారు. లేకపోతే వ్యాయామాలు చేయకపోయినా.. ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే.. పచ్చి ఆకుకూర ముక్కలు, నానబెట్టన చిరు ధాన్యాలు ముందు వరుసలో ఉంటున్నాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే.. మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.
– కూరగాయల ముక్కలు, నానబెట్టిన చిరుధాన్యాల్ని ఉదయాన్నే తీసుకుంటే… మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటుకు గురికాకుండా ఉంటారు. మధుమేహులకు కూడా ఇవి మంచిది.
– ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. వీటిని తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.
అమెరికాలో 25 సంవత్సరాలు ఉన్న 25 వేల మంది మహిళలపై పరిశోధించగా.. వారు పచ్చి కూరగాయల ముక్కల్ని తీసుకుంటే.. అధిక బరువుకి దూరంగా ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది.