చింత చిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు

Jun 12,2024 04:20

ఈ సీజన్‌లో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్‌ ఉన్న వారికి కూడా బాగానే పనిచేస్తుంది. ఫినాల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచిది పెంచుతుంది. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ప్లేమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను తగ్గిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీనితో చేసిన వంటలను చిన్నారులకు తినిపిస్తే కడుపులో నులి పురుగుల సమస్య తగ్గుతుంది. విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలున్నాయి. ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌ సమస్యలు తగ్గుతాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్‌ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలున్నాయి.

➡️