Health : పొటాటో రోజూ తింటే ఆరోగ్యకరమైనా?!

Jun 10,2024 13:26 #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : పొటాటో అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి పొటాటోతో చేసిన ఏ వంటకమైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఇక పెద్దవాళ్లు కూడా పొటాటో సలాడ్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ఇలాంటి రకరకాల వంటకాలతో దీన్ని రోజూ తింటూనే ఉంటారు. ఇలా బంగాళదుంపని రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? లేదా ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అని తెలుసుకోవాలనుందా? దీనికి వైద్యులు ఏం సూచిస్తున్నారంటే…?!

– పొటాటోలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఐరన్‌, విటమిన్‌ సి, విటమిన్‌ బి6లు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి.
– బంగాళదుంపల్ని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుని తినడం కన్నా.. వాటిని ఉడకబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. నూనెలో వేయించిన పొటాటోని తీసుకుంటే శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
– మీకు నీరసంగా ఉన్నప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపల్ని తీసుకుంటే తక్షణమే శక్తి వస్తుంది. ముఖ్యంగా పొటాటో మెదడు, ఎముకల ఆరోగ్యానికి ఎంతోమంచిది.
– ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న బంగాళదుంపల్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకే వాటిని తీసుకోవాలి.

➡️