Oct 05,2022 11:53

ప్రజాశక్తి-మండపేట : మండలంలోని అర్తమూరు గ్రామంలోని సాయిబాబా ఆలయం నాల్గవ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, ఉప సర్పంచ్, కమిటీ ఉపాధ్యక్షుడు కర్రి సత్యనారాయణరెడ్డి (జంబయ్య), నెక్‌ జాతీయ కమిటీ సభ్యుడు పడాల సుబ్బారెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు పడాల రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి శ్రీహరిరెడ్డి దంపతులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తేతలి వెంకటరెడ్డి, సత్తి గొల్లారెడ్డి, కర్రి శివారెడ్డి, కర్రి కనకసుందరరెడ్డి, చిర్ల రామన్నకాపు, చందు, చిర్ల వాసు తదితరులు పాల్గొన్నారు.