May 28,2023 22:35

మాట్లాడుతున్న నాగమణి

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌: సర్వజనులకు ఆరోగ్యం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆశావర్కర్లకు జీతభత్యాలు చెల్లించడంలోను, ఉద్యోగ భద్రత కల్పించడంలోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆశావర్కర్ల యూనియన్‌ రాష్ట్ర నాయకులు కె.నాగమణి అన్నారు. టెక్కలి బిఎస్‌జెఆర్‌ పాఠశాల ఆవరణలో ధనలక్ష్మీ అధ్యక్షతన టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండల ఆశావర్కర్ల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు అమలు చేయలేదని, హామీలు అమలు జరపాలని కోరుతున్న ఆశాలను బెదిరించడం, వేధించడం చేస్తున్నారని అన్నారు. మరో పక్క ప్రభుత్వ పధకాలు ఏవీ ఆశావర్కర్లకు అమలు చేయడం లేదని అన్నారు. సిఐటియు జిల్లా నాయకులు నంబూరు షణ్ముఖరావు మాట్లాడుతూ కనీస వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పోరాటాల ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రభుత్వ నిర్బంధాలను, వేధింపులకు వ్యతిరేకంగా సమైక్యంగా, చైతన్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు నాయకులు హనుమంతు ఈశ్వరరావు, ఆశావర్కర్లు విజయ, కుంతీ, సుజాత, అన్నపూర్ణ, ఉమా తదితరులు పాల్గొన్నారు.