Jan 14,2022 19:49

తమ ఫ్యామిలీ హీరో అశోక్‌ గల్లా నటించిన 'హీరో' చిత్రం అందరూ చూడాలని.. అతనిని ఆదరించాలని సీనియర్‌ హీరో కృష్ణ, మహేష్‌బాబు కోరారు. ఈ విషయం తెలుపుతూ కృష్ణ ఓ వీడియోని విడుదల చేశారు. 'తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జనవరి 15న అశోక్‌ గల్లా నటించిన 'హీరో' సినిమా విడుదలవుతోంది. నేను ఈ సినిమా చూశాను.. ఎక్కడా బోర్‌ కొట్టలేదు. సబ్జెక్ట్‌లో నావెల్టీ ఉంది. ఇంతకుముందు నాకు తెలిసి ఇలాంటి సినిమా రాలేదు. చాలా చక్కగా సినిమా తీశారు. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాని అందరూ చూసి అశోక్‌ గల్లాని ఆదరించి, అతనిని మంచి నటుడిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను' అని కఅష్ణ తెలిపారు. అలాగే మహేశ్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. 'నేను 'హీరో' సినిమా చూశాను.. విపరీతంగా నచ్చింది. అశోక్‌ చాలా కష్టపడ్డాడు. అన్ని ఎఫెర్ట్స్‌ పెట్టి చక్కగా నటించాడు. తనని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఈ సంక్రాంతికి వస్తున్న అశోక్‌ 'హీరో' సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని కోరుకుంటున్నాను' అన్నారు. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యకు చిత్ర యూనిట్‌కు ఆల్‌ది బెస్ట్‌ తెలిపారు.