Oct 05,2022 11:24

ప్రజాశక్తి-పెనుకొండ :  పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలంలో ఈ నెల 29,30‌‌ తేదిలలో జరుగు ఆశా వర్కర్స్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ పట్టణంలో సిహెచ్ సి నందు ఆశ వర్కర్స్ జిల్లా మహాసభ గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి మాట్లాడుతూ ఆశా వర్కర్స్ గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ, బాలింత పిల్లలు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న వీరికి కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రజలు అధికారులు ఇళ్లకు పరిమితమైనారు అయితే ఆశ వర్కర్ మాత్రం కరోనా కష్టకాలంలో వీధిలో ప్రజల ఆరోగ్యాల సేవల కోసం వారి ప్రాణాలు పణంగా పెట్టి ఇంటింటి తిరుగుతూ ఆరోగ్య సేవలు అందించారు వీరికి మాత్రం గొడి చాకిరి తప్ప కనీస సౌకర్యాలులేకుండా కూడా పనిచేశారు. ఆశా వర్కర్స్ కు గౌరవ వేతనం 15,000 పెంచాలి, పనిభారాన్ని తగ్గించాలి, ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్ లెటర్నిటి లీవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ జీవో వర్తింపచేయాలి, కోవిడ్ కాలంలో మరణించిన ఆశలకు 10 లక్షలు ఇవ్వాలి, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, 1000 నుండి 1200 జనాభాకు ఒక ఆశ వర్కర్ నియమించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆశ వర్కర్స్ కు న్యాయమైన సెల్ ఫోన్ కు 4జి సిమ్ ఇవ్వాలని తదితర డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి,ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గంగా, కార్యదర్శి అలివేలమ్మ, కోశాధికారి ఆనంద్ శ్వరి, ఉపాధ్యక్షులు రాజేశ్వరి, లలిత ,సుకన్య, సహాయ కార్యదర్శి తులసి,నాగమణి ,గౌతమి ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.