
కొలంబోలో: ఆసియా కప్ ఫైనల్ లో భారత్ బౌలర్లు విరుచుకుపడ్డారు. సిరాజ్ ఆరు వికెట్లు తీసి శ్రీలంక నడ్డి వెరిచారు. వన్డే కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో భారత్, శ్రీలంక ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక 50 రోజులకే ఆల్ అవుట్ అయింది. సిరాజ్ కు తోడుగా పాండ్యా మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీసి లంకను కుప్పకూల్చారు. కేవలం 15.2 ఓవర్లలోనే శ్రీలంక ఆల్ ఓట్ అయింది. శ్రీలంక ఇన్నింగ్స్ లో ఐదుగురు బ్యాట్స్మెన్లు డక్ ఔట్ అయ్యారు. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేదించేందుకు భారత్ బరిలోకి దిగనుంది.
ఒక మార్పుతో లంక బరిలోకి దిగింది. మరోవైపు భారత్ కూడా ఓ మార్పుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. అయితే.. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన.