Jan 13,2021 21:35

న్యూఢిల్లీ : దేశీయ ఎయిర్‌లైన్స్‌ ఇండిగో కొత్తగా మరో ఏడు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే మార్చి నుంచే రాష్ట్రంలోని కర్నూల్‌ విమానాశ్రయానికి కూడా విమాన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు గురువారం వెల్లడించింది. ఫిబ్రవరిలో దర్భంగా, లేV్‌ా, ఆగ్రా, బరేలీ, దుర్గాపూర్‌, రాజ్‌కోట్‌లకు సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తోంది. ముందస్తుగా లేV్‌ా, దర్భంగాకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలిపింది. ఏప్రిల్‌లో బరేలీ, దుర్గాపూర్‌, మే నెలలో రాజ్‌కోట్‌కు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఇండిగో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 61 నగరాలకు ఇండిగో సర్వీసులను అందిస్తుంది. ఈ సంఖ్యను 68కి చేర్చాలని నిర్దేశించుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ అనుమతులు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఆమోదం లభించిన వెంటనే ఆయా విమానాల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపింది.