Jul 03,2022 23:27

స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేస్తున్న గిరి జాగతి అసోసియేషన్‌ అధ్యక్షుడు


ప్రజాశక్తి-పాడేరు:
యువత అవకాశాలను అందిపుచ్చుకుని ఆత్మవిశ్వాసంతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని టిడబ్ల్యూటియు సీనియర్‌ రాష్ట్ర నేత, ప్రధానోపాధ్యాయుడు ఆర్‌.జాన్‌ అన్నారు. ఆదివారం తలారిసింగి జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల ఇండోర్‌ స్టేడియంలో గిరి జాగృతి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏజెన్సీలోని నిరుద్యోగ యువతకు డిఎస్‌సి, టెట్‌, కెరీర్‌ గైడెన్స్‌ ఉచిత స్టడీ మెటీరియల్‌ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు ఓటమితో ఆగిపోకుండా ముందుకు సాగుతూ విజయం సాధించాలన్నారు. నిరుత్సాహ పడకుండా బాగా చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఉచిత స్టడీ మెటీరియల్‌ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధపడుతతున్న గిరిజన యువత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరి జాగృతి అసోసియేషన్‌ అధ్యక్షుడు మోరీ సింహాచలం, లోచలిపుట్టు జిటిడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్‌, ఉపాధ్యాయులు కె.నీలకంఠం, కె.సత్యారావు, సునీల్‌, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నిరుద్యోగ గిరిజన యువత, తదితరులు పాల్గొన్నారు.