Jul 03,2022 22:31

ప్రజాశక్తి-పెద్దాపురం స్థానిక మార్కెట్‌ వద్ద ఆదివారం కురిసిన వర్షాలకు పెద్ద చెట్టు రెండు ఆటోలపై కూలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోల్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. పెద్దాపురంలో ఆదివారం జరిగే సంతకు ఆటోలో వచ్చిన వారు ఆటోలను చెట్టు కింద పెట్టి సంత సరుకులు కొనుక్కునేందుకు వెళ్లారు. అదే సమయంలో చెట్టు కూలడంతో రెండు ఆటోలు ధ్వంస మయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎస్‌ఐ ఆర్‌.మురళీమోహన్‌ అక్కడకు వచ్చి మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు. కూలిన చెట్టును తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.