Mar 18,2023 20:42

నటి అదితి రావు హైదరీ అనార్కలి పాత్రలో నటించిన పీరియాడిక్‌ డ్రామా వెబ్‌ సిరీస్‌ 'తాజ్‌ డివైడెడ్‌ బై బ్లడ్‌'. జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్‌ అవుతోంది. మార్చి 3వ తేదీన రిలీజైన ఈ వెబ్‌ సిరీస్‌.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాల్ని అదితిరావు హైదరి పంచుకున్నారు. అనార్కలి పాత్ర ఓ చారిత్రాత్రక రోల్‌ కావడంతో.. అది తనకు నాకు పూర్తిగా చాలెంజింగ్‌గా అనిపించిందన్నారు. ఈ పాత్ర అమాయకంగా, నిర్భయంగా కనిపిస్తూనే.. మానవతను చూపిస్తుందని అదితి పేర్కొంది. ఎవరైనా ఆమెకు దగ్గర కావాలని ప్రయత్నిస్తే.. ఆమె వారికి భయంతో దూరంగా వెళ్లిపోతుందని తెలిపింది. ఆ పాత్రలో స్వచ్ఛత ఉంటుందని, నమ్మకాలపై గట్టి అభిప్రాయంతో ఉంటుందని, అలాంటి ఎలిమెంట్స్‌ అన్నీ ఉండటం వల్లే ఆ పాత్ర చేయటానికి తనని ఎగ్జైట్‌ అయ్యేలా చేశాయని చెప్పింది. అనార్కలి సుతిమెత్తనైన మనస్తత్వం ఉన్న అమ్మాయి అని, ఆమెకు ఆమే అందమైన భూషణమని, అందుకే ఆమె చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందని వెల్లడించింది. ఈ పాత్రలో నటించడం వల్ల.. ప్రేమను మించి శక్తివంతమైన అంశం ఇంకోటి ఉండద్న అంశాన్ని అర్థం చేసుకోగలిగానని తెలిపింది.