Jul 21,2021 06:59

ఈ పక్క ఇక్కట్లు
ఆ పక్కనే తప్పెట్లు
సక్కిలిగింతల యవ్వారం
ఏడ్వాలో నవ్వాలో
తెలియని దుమారం
ఎగరేసుకెళ్ళే రేట్లు
తోసుకెళ్ళే గేట్లు
ఎక్కడ చూసినా
ముప్పేట చీవాట్లు
ఎనక పక్క చెరువు
ముందర పక్క కరువు
రూకలు మాత్రం చెల్లవు
నోట్లు మాత్రం బరువు

అయ్యబాబోయ్
అగచాట్లు పైవాడికెరుక
రాజకీయ చదరంగం
ఎల్లప్పుడూ రణరంగం
కిందవాడు కిందనే
పైవాడు పైనే
అటు ఇటు కానివాళ్ళు
ఎటూ కాని ఏకాకులు
పాలకులు పసిడిరాళ్ళు
కార్యకర్తలు పలుకురాళ్ళు
ఓటర్లు బండరాళ్లు
పరిస్థితులు గబ్బిలాలు

అయ్యబాబోయ్
అన్నీ పోట్లాటలు తోపులాట్లు
చివరికి మిగిలేది
కుట్లేసుకు తొడిగిన అంగీలు
మాట్లేసి పెట్టుకున్న పాతర్లు
కుట్టుకున్న విస్తరాకులు
నమిలి ఉమ్మేసే తమలపాకులు.

- నరెద్దుల రాజారెడ్డి,
ఫోన్‌ : 9666016636