Aug 09,2022 16:31

ప్రజాశక్తి-కలువాయి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కలువాయి మండల కేంద్రమైన బివిఎంఆర్ జడ్పీ హైస్కూల్ విద్యార్ధులు ఈరోజు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు ఈరోజు ఆవశ్యకతను తెలియజేస్తూ బివిఎంఆర్ జడ్పీ పి హైస్కూల్ కలువాయి 24వ ఆంధ్రా బెటాలియన్ అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ జి పెంచల పుల్లయ్య ఆధ్వర్యంలో గ్రామంలో 100 మంది విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని క్విట్ ఇండియా మూవ్మెంట్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి వ్యక్తి నిస్వార్థంతో దేశభక్తి కలిగి జాతి ఔన్నత్యాన్నికి పాటుపడాలని తెలియజేశారు. భరతమాత గాంధీ వేషధారణతో మరియు దేశభక్తి స్లొగన్స్ తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంచల పుల్లయ్య విద్యార్థులు పాల్గొన్నారు.